సిసింద్రిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ ఏడాది తన కుమారుడు అఖిల్ కలలు నిజం కావాలని అక్కినేని నాగార్జున ఆశీర్వదించారు. శనివారం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. అమల, అఖిల్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత, సుమంత్, సుశాంత్, రానా దగ్గుబాటి, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, సాయేషా సైగల్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితరులు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ అఖిల్ కృతజ్ఞతలు చెప్పారు.
మొదటి సినిమా అఖిల్ కు అంతగా కలిసిరాకపోవడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నాగ్. అఖిల్ కెరీర్ విషయంలో ఆచితూచి స్టెప్స్ వేస్తున్నాడు. స్టోరీపై ఫుల్ కాన్సన్ ట్రేషన్ , హోప్ ఏర్పడ్డాకే అఖిల్ రెండో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ్. అఖిల్ సెకండ్ మూవీకి ఇటీవల పూజా కార్యక్రమం జరిగింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి పలు పేర్లను పరిశీలిస్తున్నారు.
May all your dreams come true this year dear son😘💐💐💐@AkhilAkkineni8 /#HBDAkkineniAkhil pic.twitter.com/foLiWTbIGi
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 8, 2017