మహేష్‌ అల్లరి చేస్తాడా..?

143
Allari Naresh in Mahesh Babu's film

సుపర్‌ స్టార్‌ మహేష్ బాబు వరుసగా సినిమాలుతో మంచి స్పీడ్‌ మీద ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ మహేష్ కమిట్మెంట్స్ ఇచ్చేశాడనే విషయం తెలుస్తూనే ఉంది. మురుగదాస్ తో తెరకెక్కిస్తున్న హై బడ్జెట్ బై లింగ్యువల్ మూవీ ఇంకా పూర్తి కానే లేదు. మరోవైపు మే నెల నుంచి కొరటాల శివతో ‘భరత్ అను నేను’ పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టేయనున్నాడు మహేష్. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మూవీ చేసేందుకు ఓకే చేశాడు సూపర్ స్టార్.

Allari Naresh in Mahesh Babu's film

అసలు విషయానికొస్తే మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ ను ఓ ప్రధాన పాత్ర కోసం తీసుకోనున్నారట. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన డీటైల్స్ తో అల్లరి నరేష్ ను కలిశాడట వంశీ పైడిపల్లి.అయితే ఈ స్టోరీలో చాలా కీలకమైన పాత్రను అల్లరి నరేష్ పోషించనున్నాడట. ఈ పాత్రకి నరేష్‌ అయితే సరిగ్గా సరిపోతాడని,ఈ విషయం మహేష్‌కి కూడా ఇప్పటికే చెప్పినట్లు టాక్.మరి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా రాదా అనే విషయం ఇంక ఫైనల్‌ కాలేదట.

ఎందుకంటే ఈ ప్రాజక్టు ప్రారంభమయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని.. ఏడెనిమిది నెలలకు గానీ ఈ సినిమా పై క్లారిటీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అయితే.. అల్లరి నరేష్ ఒప్పుకుంటే ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేలా ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చని ఆ ఉద్దేశ్యంతోనే ఇంత ముందుగా నరేష్‌ని అడిగినట్టు దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు.