అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ప్రోడక్షన్ నెం 5 గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ లు నిర్మాతలుగా నిర్మాణం చేపడుతున్న చిత్రం పూజాకార్యక్రమాలు ఈరోజు ఫిల్మ్‌నగర్ టెంపుల్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున గారు, శ్రీమతి అమల గారు, మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ గారు, శ్రీ అల్లు అరవింద్ గారి సతీమణి శ్రీమతి నిర్మల గారు, దర్శకుడు పరుశురామ్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, మారుతి గారు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున గారు గౌరవ దర్శకత్వం వహించగా స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా శ్రీ అల్లు అరవింద్ గారి మనమరాలు బేబి అన్విత క్లాప్ కొట్టారు. ప్రశాంతమైన వాతావరణం లో ఈ చిత్రం పూజాకార్యక్రమాలు జరుపుకొగా ఈ కార్యక్రమానికి శ్రీ అల్లు అరవింద్ గారు, కింగ్ నాగార్జున ఫ్యామిలీలు రావటం యూనిట్ అందర్ని ఆకట్టుకుంది.
అక్కినేని నాగేశ్వరావు గారి, అక్కినేని నాగార్జున గారి నట వారసుడుగా పరిచయమైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తను చేసిన హలో, మిస్టర్ మజ్జూ లాంటి లవ్ కమ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్స్ తో అక్కినేని అభిమానులనే కాకుండా ఫ్యామిలి అండ్ గర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మరిల్లు లాంటి చిత్రం ఇప్పటికి ట్రెండ్ సెట్టర్ ఇన్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా నిలిచిపోయిందంటే అది కేవలం దర్శకుడు భాస్కర్ విజన్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ తరువాత వచ్చిన పరుగు చిత్రం ప్రతి ఓక్కరిని ఆలోచింపచేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలి ఆడియన్స్ లో భాస్కర్ ది సెపరేటు ఇమేజ్ వుంది. ఇప్పడు వీరద్దిరి కాంబినేషన్ లో చిత్రం అనగానే ఈ క్రేజ్ మరింత పెరిగింది.
గతం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% లవ్.. ఈ చిత్రం లో అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వం లో నిర్మాత బన్ని వాసు నిర్మాత గా నిర్మించాడు. ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని సాధించటం విశేషం.. మళ్ళి ఇప్పుడు అక్కినేని వారి మరో నట వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాతలు బన్ని వాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు, పరుగు లాంటి ట్రేండ్ సెట్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ చిత్రాల్ని దర్శకత్వం వహించిన భాస్కర్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా 100% లవ్ కి డబుల్ హిట్ ని సాధిస్తుందరి యూనిట్ లో కాన్షిడెన్స్ వుండటం విశేషం.
మెగాప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారు సమర్సణ లో బన్ని వాసు ప్రోడ్యూసర్ గా 100% లవ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం వరకూ వరస బ్లాక్‌బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రీప్ట్ లతో అప్‌డేటెడ్ గా అల్లు అరవింద్ గారి సలహలు సూచనలతో బన్ని వాసు యువ నిర్మాత గా సక్స్‌రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో ఓకడిగా తనకంటూ ప్రత్యేకత ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పడు ఈ చిత్ర కథ నచ్చిన మరో యంగ్ దర్శకుడు వాసు వర్మ మెట్టమెదటిసారిగా నిర్మాణ రంగంలోకి బన్ని వాసుతో కలిసి యంగ్ డైనమిక్ అఖిల్ అక్కినేని తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మరియు షూటింగ్ షెడ్యూల్స్ వివరాలు త్వరలో తెలియజేస్తాం అని నిర్మాతలు తెలిపారు..