ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్..అతిథులు వీరే!

38
rrr

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవలె బాలీవుడ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా తాజాగా టాలీవుడ్‌లో సైతం అంతకుమించి ఉండేలా ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు.

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవనున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై కన్‌ఫర్మేషన్ రానుంది. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తుండగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.