24 నుండి దేశవ్యాప్త ఆందోళనలు: కాంగ్రెస్

186
ak antony
- Advertisement -

ఈ నెల 24 నుండి దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లు అమోదాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. నల్ల చట్టాలు రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్టీ సమావేశం జరిపి దేశవ్యాప్త ఆందోళనల‌కు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టనుంద‌ని …ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, మాజీ మంత్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌ వరకూ పాదయాత్రలు చేసి గవర్నర్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు.

రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు, గందరగోళ పరిస్థితుల మధ్య మూజువాణి ఓటుతో వ్యవసాయ రంగానికి చెందిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అంతేగాక‌ సభా నియమావళిని ఉల్లంఘించారంటూ 8 మంది ఎంపీలను రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాడు వారం రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -