అజిత్‌ ‘దాదా’…మహా రాజకీయాల్లో చెరగని ముద్ర!

5
- Advertisement -

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన ఓసారి ఎంపీగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరు సార్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

అజిత్ పవార్ (22 జూలై 1959న జన్మించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన, మహారాష్ట్రలో ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నేతగా గుర్తింపు పొందారు.

అజిత్ ప్రస్తుతం.ఆర్థిక, ప్రణాళిక, రాష్ట్ర ఎక్సైజ్, మైనారిటీ అభివృద్ధి వంటి కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. 2023లో బాబాయ్ శరద్ పవార్‌తో జరిగిన రాజకీయ విభజన అనంతరం ఎన్‌సీపీకి నాయకత్వం వహించారు. 1991 నుంచి బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుస్తూనే ఉన్నారు.

అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ (రాజ్యసభ ఎంపీ), కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్. ఆయన అనుచరులు ప్రేమగా దాదా అని పిలిచేవారు. అంతేగాదు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పవార్.

Also Read:విమాన ప్రమాదం..అజిత్ పవార్ మృతి

- Advertisement -