- Advertisement -
మహారాష్ట్రలోని బారామతిలో అజిత్ పవార్ ప్రయాణించాల్సిన విమానం అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందారు. బారామతిలో ప్రజాసభల్లో పాల్గొనాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు అధికారులు, ఇద్దరు పైలెట్లు ఉన్నారు.
ప్రమాద స్థలంలో తీసిన దృశ్యాల్లో మంటలు, పొగలు ఎగసిపడుతున్నట్లు, విమానం పూర్తిగా ధ్వంసమైన అవశేషాలు కనిపిస్తున్నాయి. అత్యవసర ల్యాండింగ్‌కు కారణమైన పరిస్థితులు తెలియాల్సి ఉంది.
ముంబై నుంచి ఉదయం విమానం బయల్దేరిన సుమారు గంట తర్వాత, అంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బారామతిలో జరిగే ర్యాలీలకు అజిత్ పవార్ హాజరుకావాల్సి ఉంది.
Also Read:సన్నీ డియోల్‌తో జ్యోతిక!
- Advertisement -

