- Advertisement -
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు రీతేశ్ సిద్ధ్వానీ మరియు ఫర్హాన్ అఖ్తర్లు, సూపర్ స్టార్ సన్నీ డియోల్‌తో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక ఎంపికయ్యారు. హిందీ సినిమాలో సన్నీ డియోల్‌తో జ్యోతిక జోడీ కట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ చిత్రానికి బాలాజీ గణేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కొత్తదనం ఉండేలా, అదే సమయంలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఈ భారీ బడ్జెట్ చిత్రంతో సన్నీ డియోల్‌కు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో ఇదే తొలి చిత్రం కావడం మరో విశేషం.
Also Read:పార్లమెంట్ సమావేశాలు..అఖిలపక్ష సమావేశం
- Advertisement -

