అజిత్ ధోవల్‌తో సీఐఏ చీఫ్ భేటీ..

213
ajit
- Advertisement -

అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బ‌ర్న్స్‌తో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ భేటి అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌పై వీళ్లిద్ద‌రూ చ‌ర్చించారు. తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే ఈ ఇద్ద‌రూ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇక మరోవైపు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ప్రపంచానికి పెనుసవాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అప్ఘనిస్తాన్ ప్రధానిగా ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ నియామకం అయ్యారు. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉప ప్రధానిగా, సిరాజుద్దీన్ హక్కానీ హోంమంత్రిగా.. హక్కాని నెట్‌వర్క్‌ చెందిన అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌ మరో ఉప ప్రధానిగా నామినేట్ అయ్యారు.

- Advertisement -