కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశాన్ని నిర్వహించేందుకు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కేరళకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యేల మనోగతం ఏమిటో తెలుసుకుంటాం” అని అజయ్ మాకెన్ మీడియాకు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించనున్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన UDF, 2026 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో తిరిగి కేరళలో పీఠాన్ని కైవసం చేసుకుంది.
Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది
పార్టీలో ఉన్న సీనియర్ నాయకులలో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారనేది ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

