‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడికి.. యంగ్ హీరో ఆఫర్..

266
ajay bhupathi
- Advertisement -

టాలీవుడ్ లో అందరి నోట ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా అందరిని అంతగా ప్రభావితం చేసింది. యూత్ లో మంచి క్రేజ్ ని సంపాధించుకుని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అజయ్ భూపతికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

nitiin

ఇప్పటికే సురేష్ బాబు, స్రవంతి కిషోర్ వంటి పెద్ద బ్యానర్ల నిర్మాతలు అజయ్ భూపతితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో బడా ప్రొడ్యూసర్ యంగ్ హీరో నితిన్ తండ్రి, దర్శకుడు అజయ్ భూపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. నితిన్ తో సినిమా చేయడానికి అజయ్ భూపతి కూడా ఓకే చెప్పేశాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ పూర్తి చేసుకుని, వెంకీ కుడుములతో ఓ సినిమా చేయనున్నాడు. ఈసినిమా పూర్తైన వెంటనే.. అజయ్ భూపతితో నితిన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నితిన్, వెంకీ కుడుములతో సినిమా పూర్తి చేసేలోపు.. అజయ్ పూర్తి స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని సిద్దంగా ఉంటాడని టాక్. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన అజయ్ భూపతి… నితిన్ తో తన రెండవ మూవీతో మరో సంచలనాన్ని సృష్టిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -