కరోనాతో హోంక్వారంటైన్ లో ఐశ్వర్యరాయ్

524
abhishek
- Advertisement -

బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ న్యూస్‌ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమితాబ్‌తో పాటు అభిషేక్‌కు కరోనా పాజిటివ్ రాగా తాజాగా ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు.

జయాబచ్చన్‌, ఐశ్యర్యరాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగెటివ్‌గా వచ్చిందని తెలిపిన కొద్ది సమయానికే రెండో విడత పరీక్షల్లో ఐష్‌తో పాటు ఆరాధ్యకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో వీరిని హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

బచ్చన్ ఫ్యామిలీ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా తెలిపారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే .అమితాబ్‌తో పాటు అభిషేక్ పరిస్ధితి బాగానే ఉందని తెలిపారు.అమితాబ్ నివాసం ఉండే ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన అధికారులు ఆ ఏరియాను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

- Advertisement -