రిపబ్లిక్‌లో ఐశ్వర్ రాజేష్..!

174
aishwarya rajesh
- Advertisement -

కోలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న యువ హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేష్‌ ఒకరు. ఈ అమ్మడు తమిళ, తెలుగు సినిమాలలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ సరసన రిపబ్లిక్ మూవీలో నటిస్తోంది.

తాజాగా సినిమాలో ఐశ్వర్య రాజేష్ లుక్‌ని రిలీజ్ చేసింది. కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం.. అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్ తో పాటు ఉన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో మైరా హాన్సన్ అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ ఫస్ట్ వీక్‌లో విడుదల కానుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తుండగా జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్, న్యాయం లాంటి ప్రధానాంశాల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. మణిశర్మ సంగీతం అందించారు.

- Advertisement -