దేశంలో 24 గంటల్లో 44,658 కరోనా కేసులు..

156
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో 44,658 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 496 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3,26,03,188కు చేరగా 3,18,21,428 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,44,899 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 4,36,861 మంది మృతిచెందారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.