‘ఆర్ఆర్ఆర్’లో ఐశ్వర్య రాజేష్‌..!

536
Aishwarya Rajesh
- Advertisement -

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్‌గా రూపొందుతోంది. బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ హైదరాబాదులో నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇదే నెలలో అలియా భట్ కూడా షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు.

RRR

అయితే ఈ చిత్రం నుండి మరో కొత్త సమాచారం అందుతోంది. ఈ మూవీలో మరో కీలక పాత్ర వుందట. ఎన్టీఆర్ పాత్ర అయిన భీమ్ సరసన హాలీవుడ్ నటి ఓలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, భీమ్‌కు జోడీగా మరో కథానాయిక కూడా ఉంటుందనీ, అది గిరిజన యువతి పాత్ర అనీ కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఈ పాత్రలో హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. పాత్ర చిన్నదైనా విషయం గల పాత్ర కావడంతో ఐశ్వర్య రాజేశ్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -