వినియోగదారులకు మళ్లీ షాకివ్వనున్న ఎయిర్‌టెల్!

103
airtel
- Advertisement -

వినియోగదారులకు మళ్లీ షాకిచ్చేందుకు సిద్ధమమవుతోంది ఎయిర్ టెల్. ఈ ఏడాది ప్లాన్ల చార్జీలను పెంచుతామని లీకులు ఇచ్చి వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్‌ కాల్‌, సర్వీసెస్‌ రేట్లను పెంచడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు ఆ సంస్థ సీఈవో.

ఛార్జీలు పెంచేందుకు తాము ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ఈ ఏడాది ఒక్కో వినియోగదారుడి నుంచి పొందే సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) రూ.200లకు తీసుకెళ్లాలని ఎయిర్‌టెల్‌ చూస్తున్నది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న చార్జీలే మొబైల్‌ యూజర్లకు పెను భారంగా ఉన్నాయి.

గతేడాది నవంబర్‌లో తొలుత చార్జీలను 18-25 శాతం పెంచింది ఎయిర్‌టెల్ సంస్థేనన్న సంగతి తెలిసిందే.

- Advertisement -