ఎయిర్‌టెల్ నుండి నయా ఆఫర్‌..

248
Airtel
- Advertisement -

ప్రస్తుతం టెలికాం రంగానికి జియో చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. భారతీఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ. 76 ప్లాన్‌తో మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఈ ఆఫర్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

Airtel

రూ. 76 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వరకు రూ. 26 టాక్‌టైం, 100జీబీ డేటా ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. కొత్త రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు నిమిషానికి 60 పైసలు, 2జీ,3జీ,4జీ ఫోన్లకు డేటాను ఉపయోగించుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కొత్త సిమ్ కార్డు తీసుకున్న కస్టమర్లు అందుబాటులో ఉంటుందని, మై ఎయిర్‌టెల్ యాప్, అధికారిక ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

- Advertisement -