తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన ఇంకా అభ్యర్దులను ఎందుకు ప్రకటించలేదంటూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి లిస్ట్ వచ్చిన పొత్తుల కారణంగా అభ్యర్దులను ఖారారును చేయటంలో జాప్యం జరుగుతోందంటున్నారు. మహాకూటమి పొత్తులకు సంబంధించిన చర్చల వివరాలను ఆయనకు వివరించారు.
మహాకూటమిలో చర్చలు నడుస్తుండటంతో రాష్ట్ర నేతలు ఇంకా అభ్యర్దులను ఖరారు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. మహాకూటమి లిస్ట్ బయటకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈలిస్ట్ లో పేర్లు లేని వారు తమ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. దింతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే గడుపుతున్నారు. నేటి నుంచి నోటిఫికేషన్ ప్రారంభమవడంతో రేపు అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.