చిన్నమ్మకే పట్టం..

192
sasikala
- Advertisement -

అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నాటరాజ్‌ కు అప్పగించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ నటరాజన్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్నమ్మ ఆధ్వర్యంలో పని చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి నేతలంతా ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళ నటరాజన్‌ నే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీంతో పార్టీ పరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్టు అన్నాడీఎంకే పార్టీ వెబ్‌ సైట్‌ లో అధికారికంగా ప్రకటించారు.

sasikala

ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 23 మంది కలిసి సమావేశమై ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ముందుగా దివంగత నాయకురాలు జయలలితకు నివాళి అర్పించారు. సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు. జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానం చేశారు. అమ్మకు భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానం ఆమోదించారు. అంతేకాదు మెగసెసె అవార్డు, నోబెల్‌ శాంతి పురస్కారానికి జయలలిత పేరును ప్రతిపాదించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు తీర్మానించారు.

sasikala

- Advertisement -