మత్య్స,పాల ఉత్పత్తికి చేయుత..

72
CM KCR

తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో చెరువులన్నీ నిండి చేపల పెంపకానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర్రంలో మత్స్యకారులకు అన్యాయం జరిగిందని..మత్స్యకారులు అంటే కేవలం తీరప్రాంతంలో ఉన్నవారికే ప్రాదాన్యత ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇక్కడ వారి ప్రయోజనాలను పూర్తీగా విస్మరించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారికి చేయుతనిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్నారు. అన్ని చెరువుల్లో కలిపి నాలుగున్నర వేల కోట్ల చేప పిల్లలు పెంచుకునే అవకాశాలున్నాయని వివరించారు.

CM KCR

చేప పిల్లల పంపిణీ విషయంలో మంత్రి తలసాని కృషిని అభినందిస్తున్నానన్నారు. అటు పాల ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. . స్థానికంగా లభ్యమౌతున్న పాలతో పాటు బెంగళూరు, గుజరాత్ నుంచి తెచ్చి అమ్ముతున్నారంటున్నారు. ఈ పరిస్థితులు తలెత్తడానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంది. పాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పాల బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటమని తెలిపారు. మత్స్య, పాల ఉత్పత్తి అనేది అధిక సంఖ్యాక సామాన్యుల జీవనానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో జనవరి మొదటివారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చను చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాసనసభలో మత్స్య, పాల ఉత్పత్తులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం స్పందించారు.