అమీర్ ఖాన్ పాదాలు తాకాలని ఉంది..

148
Varma

రామ్ గోపాల్ వర్మ తీరే వేరు. తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా..ఓ వైపు తన సినిమాలు వివాదంలో ఇరుక్కున్నా..నాకేం పట్టనట్టు ఇతర విషయాలపై స్పందిస్తుంటాడు. తాజాగా ఇప్పుడు అదే జరిగింది. ఓ పక్క బస్తీమే సవాల్ అంటూ.. వంగవీటి సినిమా వివాదాన్ని ఛాలెంజ్ చేసిన వర్మ..మరోవైపు బాలీవుడ్ ఖాన్ త్రయంపై ట్వీట్టర్ ద్వారా సేటర్లు వేశాడు. అమీర్ ఖాన్ తాజా మూవీ దంగల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటుగా అటు సినిమా ఇండస్ట్రీపై , ఇటు ఇతర ఖాన్‌లపై రెచ్చిపోయి కమెంట్ చేశారు.

Varma

భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై అమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. అమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తాడు.అలా ఎదగడంలో అమీర్ సిన్సియారిటీని చూస్తే.. ఆయన పాదాలను తాకాలని ఉంది. అమీర్ ఖాన్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది.

Varma

బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇంతటితో సరిపెట్టలేదు వర్మ… ‘దంగల్‌’ చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్‌ చేశారు.