గత కొన్ని రోజులుగా సాగుతున్న అన్నాడీఎంకేలోని అధినాయకత్వ పోరును మరోసారి తనకు అనుకూల వర్గాన్నికి సపోర్టు చేస్తూ మాట్లాడింది వీకే శశికళ. ఓపీఎస్ (పన్నీరు సెల్వం), ఈపీఎస్ (పళనిస్వామి) వర్గాల మద్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఓపీఎస్‌ను బయటకి పంపారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఓపీఎస్‌కి ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నమ్మిన బంటుగా ఉన్న ఓపీఎస్ ను తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయంశంగా మారింది.
తాజాగా వీకే శశికళ ట్వీటర్ ద్వారా “కొన్ని నమ్మకద్రోహాలు మరియు అవకతవకల కారణంగా మా ఏఐఏడీఎంకే పటిష్టమైన నిర్మాణం కుప్పకూలింది. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ డిసెంబర్ 2016 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంది. అన్నీ కేవలం కార్యచరణ సమావేశాలు మాత్రమే. నేను ఉన్నంత వరకు ఏఐఏడీఎంకేను ఎవరూ స్వాధీనం చేసుకోలేరు లేదా నాశనం చేయలేరు. పార్టీని ఎలా కలపాలో నాకు తెలుసు ” అని ట్వీట్ చేశారు.