ఫిదా భామ బాగానే పెంచేసింది..

178
sai pallavi
- Advertisement -

మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ పొందిన సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఇక ఆ సినిమా ఇమేజ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అంటూ ప్రేక్షకులని తన మాయలో పడేసింది సాయి పల్లవి. ఆ ముద్దుగుమ్మ‌ను భాన్సువాడ భానుమ‌తి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

sai pallavi remuneration

హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో ఓ సినిమాను హీరోయిన్ సింగిల్ హ్యాండ్ గా త‌న భుజాల‌పై మోయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ సాయిప‌ల్ల‌వి అది చేసి చూపించింది. అదే ఫిదా రూపంలో ఇప్పుడు మ‌న‌కు క‌నిపిస్తుంది. ఈ చిత్రం ఈ రోజు ఇంత పెద్ద విజ‌యం సాధించిందంటే కార‌ణం సాయిప‌ల్ల‌వి అన‌డంలో ఆశ్చ‌ర్య‌మే లేదు. శేఖ‌ర్ క‌మ్ముల కూడా త‌న సినిమాకు గుండె సాయిప‌ల్ల‌వి అయితే బాడీ వ‌రుణ్ తేజ్ అన్నాడు. ఈ ఒక్క మాట చాలు సినిమాకు సాయి చేసిన కృషి ఏంటో చెప్ప‌డానికి. ఇక ఇప్పుడు ఈమెకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.

sai pallavi remuneration

అయితే ఫిదా కోసం అమ్మడు తీసుకున్న మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం మన వంతు. మాములుగా టాలీవుడ్‌లో ఫస్ట్ సినిమాకు కాస్త తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే వారికి హిట్ వచ్చాక మాత్రం వారు తమ రెమ్యునరేషన్ ను పెంచుతారు. అయితే సాయి పల్లవికి టాలీవుడ్‌లో ఫిదా సినిమానే ఫస్ట్. కానీ అమ్మడు మలయాళంలో ప్రేమమ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ సంపాధించిన ఈ బ్యూటీ, ఫిదా కోసం తీసుకున్న మొత్తం అక్షరాల 30 లక్షల రూపాయలు. అయితే సినిమా హిట్ కావడంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచినట్లు తెలుస్తుంది. ఈమెకు ఇవ్వ‌డంలో కూడా త‌ప్పు లేద‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. ప్ర‌స్తుతం ఈ భానుమ‌తికి ఉన్న డిమాండ్ కు కోటిచ్చినా త‌క్కువే అంటున్నారు. మ‌రి చూడాలిక‌.. మ‌రో రెండు సినిమాలు హిట్టైతే భాన్సువాడ భానుమ‌తిని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

- Advertisement -