ఆహా … “తరగతి గది దాటి”

260
aha
- Advertisement -

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫుల్‌ మీల్స్‌ను అందిస్తోంది. ఇక కేవలం సినిమాలకే కాకుండా సరికొత్త ప్రోగ్రామ్స్‌తో ఓటీటీ వేదికకు సరికొత్త అర్థం చెప్పి ఆడియన్స్‌తో ‘ఆహా’ అనిపించుకుంటోంది. ఇప్పటికే తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన నీడ, సూపర్‌ డీలక్స్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఇక ఇటీవల అమల్‌ పాల్‌ నటించిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఆహా’ తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సీరీస్ ఆగస్ట్ 20న ఆహా లో విడుదల అవుతుంది

‘తరగతి గది దాటి’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టీజర్ ని పీవీపీ మాల్ లో విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల మధ్య ఏర్పడ్డ అందమైన ప్రేమ కథను అద్భుతంగా చూపించనున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్‌ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మల్లిక్‌ ‘తరగతి గది దాటి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో భాగంగానే రాజమండ్రి నేపథ్యంగా వెబ్‌ సిరీస్‌ను యూ ఉంటుంది. కృష్ణ, జాస్మిన్‌ అనే ఇద్దరు టీనేజర్ల మధ్య ప్రేమ ఇతి వృత్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ కథ ఉండనుంది. ఈ వెబ్‌ సిరీస్‌ను మొత్తం 5 ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. మరి మరో క్యూట్‌ లవ్‌ స్టోరీ రూపంలో డిజిటల్ ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి వస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -