అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతం అయింది. ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం చేపట్టారు. అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించాయి రక్షణ శాఖ వర్గాలు.
బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ఆగస్టు 20న చాందిపూర్ నుండి విజయవంతంగా పరీక్షించాం. ఈ ప్రయోగం అన్ని ఆపరేషనల్, సాంకేతిక పరామితులను ధృవీకరించింది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బుధవారం పరీక్షించిన క్షిపణి, భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణి (ICBM) అగ్ని–5 యొక్క ఒక వేరియంట్. ఇది 5,000 కి.మీ. పరిధి కలిగింది. దేశం యొక్క దీర్ఘకాలిక భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దీన్ని రూపొందించింది.
మునుపటి అగ్ని–5 ట్రయల్ 2024 మార్చి 11న జరిగింది. ఆ పరీక్షలో DRDO ఈ క్షిపణిని MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) సాంకేతికతతో విజయవంతంగా ప్రయోగించింది. ఈ సాంకేతికత ఒకే ప్రయోగంతో బహుళ లక్ష్యాలను చేధించే సామర్థ్యాన్ని ఇస్తుంది.
Also Read:వినియోగదారులకు జియో షాక్!

