తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారని తెలిపింది ఇండియా టుడే సర్వే. నిన్న ఎన్డీటివి సర్వేలో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండబోదని సాయంత్రం విడుదలైన పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఈ) సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగం మందికి పైగా ప్రజలు మళ్లీ కేసీఆర్ ఏ సీఎం కావాలని కొరుకుంటున్నారని తెలిపారు.
గత నెల రోజుల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో మరో నాలుగు శాతం మద్దతు పెరిగిందని తెలిపింది. నెల రోజుల క్రితం తాము సర్వే చేసినపుడు టీఆర్ఎస్ కు 44శాతం మంది మద్దతు తెలపగా తాజాగా వారు చేసిన సర్వేలో 48శాతం మద్దతు పెరిగిందని తెలిపారు. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 6877 మందిని ప్రశ్నించి సర్వే నివేదికను రూపొందంచినట్టు పీఎస్ఈ తెలిపింది.
ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత బలమైన శక్తిగా ఉన్నదని తెలిపింది. టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీలో బలంగా ఉందని తెలిపింది.ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు రైతు బీమాతోపాటు పలు పథకాల వల్ల చాలా మంది రైతులు లాభపడుతున్నారని తెలిపింది.