త్రిష పెళ్లి పై పుకార్లు షికార్లు

34
- Advertisement -

సహజంగా హీరోయిన్ల పెళ్లి పై, ప్రేమ పుకార్ల పై నెటిజన్లలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే, ఫలానా హీరోయిన్ గురించి పొరపాటున ఓ రూమర్ వినిపిస్తే చాలు.. వెబ్ సైట్లు అన్నీ పోటీ పడి మరీ.. ఆ వార్తలను వైరల్ చేసే దాకా నిద్ర పోవు. హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకుందంట. తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆమె ఈ పని చేసిందంట. ఇలా 2 రోజులుగా త్రిష పై తమిళ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. మరీ గమ్మత్తైన విషయం ఏంటంటే, త్రిష పెళ్లి చేసుకుంది అని వార్తలు రాగానే చాలామంది అది నిజం అనుకున్నారు. కారణం.. ఆ మధ్య త్రిష ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. కానీ ఆ స్నేహం పెళ్లి వరకూ దారి తీయలేదు.

ప్రస్తుతం త్రిష సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. సాధారణంగా తనపై ఎలాంటి పుకార్లు వచ్చినా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోతుంటుంది త్రిష. అయితే ఈసారి మాత్రం ఆమె అలా ఉండలేకపోయింది. తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని త్రిష చాలా ఘాటుగా ఖండించింది. త్రిష మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులతో లింక్ అయి ఉన్నప్పుడు, నేను మాట్లాడాలి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో నాకు కనెక్షన్ పెట్టి పెళ్లి వార్తలు రాస్తున్నారు’ త్రిష ఫీల్ అయ్యింది.

త్రిష ఇంకా మాట్లాడుతూ..’నా సినీ కెరీర్ లో నాకు ఎన్నో సార్లు పెళ్లి చేశారు. కొందరు అయితే, నన్ను తల్లిని కూడా చేశారు. ఎందుకు ఇలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా, పెయిడ్ బాట్స్ ద్వారా ఈ పని చేస్తున్నారు. ఓవైపు నా సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంతలోనే ఈ పనికిమాలిన పనులు నన్ను నిరుత్సాహపరుస్తున్నాయి’ అని త్రిష సీరియస్ అయ్యింది. త్రిష ను అసౌకర్యానికి గురి చేయడానికి కొందరు కావాలనే కంకణం కట్టియున్నారు అని త్రిష చెబుతుంది. మరి ఆ కొందరు ఎవరు అనేది త్రిష నే చెప్పాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే..నవ్వుల రాజు అలీ

- Advertisement -