మధ్యాహ్నం నిద్ర..ఎన్ని లాభాలో తెలుసా!

3
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అంతే కాకుండా రోజంగా పని ఒత్తిడి కారణంగా కూడా రాత్రివేళల్లో నిద్రకు భంగం వాటిల్లుతుంది. రిగా నిద్ర లేకపోవడం వల్ల.. రోజంతా బద్దకం, అలసట, వంటి సమస్యలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.

చాలా మందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర కమ్ముకువస్తుంది. అయితే, మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదని అనుకుంటారు. కానీ మధ్యాహ్నం కాసేపు నిద్ర పోతే ఎంతో మేలు కలగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని జర్నల్ ఆఫ్ అమెరికా హార్ట్ అసోసియేషన్​ అధ్యయనంలో తేలింది.

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్‌, స్థూలకాయం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమవుతాయని తెలుస్తోంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Also Read:TTD: వేడుకగా కార్తీక దీపోత్సవం

- Advertisement -