అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (హార్ముజ్ జలసంధి)ని తిరిగి ప్రారంభించడం వల్ల ప్రపంచ మార్కెట్లలో భారీ సానుకూలత కనిపించింది. ఈ ప్రాథమిక ఒప్పందం తర్వాత ఇంధన ధరలు తగ్గుతాయా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు పశ్చిమ ఆసియా ఘర్షణల కారణంగా పెరిగిన ముడిచమురు ధరలు చమురు కంపెనీల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో గత నెలలో లీటరుకు సుమారు ₹7.50 వరకు ధరలను పెంచాయి. అయితే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నారనే వార్తలతో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 1.12% (89 సెంట్లు) తగ్గి బ్యారెల్‌కు $78.66 వద్దకు చేరుకుంది.
బుధవారం బ్రెంట్ క్రూడ్ ధరలు మరియు యుఎస్ డాలర్ ఇండెక్స్ మరింత తగ్గడంతో భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 10 పైసలు బలపడి 94.50 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 79 డాలర్ల కంటే కిందకు పడిపోవడంతో చమురు ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గిస్తాయా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది.
Also Read:2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!

