ఢిల్లీ అసెంబ్లీ..ఫిబ్రవరి 8న పోలింగ్..11న ఫలితాలు

553
sunil arora
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల ఓటర్లు ఉన్నారని..13767 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సునీల్ అరోరా. పోలింగ్ కేంద్రాలన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చూస్తున్నామన్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 90 వేల మంది సిబ్బందిని ఉపయోగిస్తామన్నారు.

జనవరి 14న ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు.జనవరి 21న నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ కాగా జనవరి 22న నామినేషన్ల పరిశీలన..జనవరి 24న విత్ డ్రా కు అవకాశం..ఫిబ్రవరి 8 పోలింగ్ జరుగుతుందన్నారు. సింగిల్ ఫేజ్‌లో ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయని…11 ఫిబ్రవరిన ఫలితాలు వెల్లడవుతాయన్నారు.

ఫిబ్రవరి 22తో ఆప్ ప్రభుత్వ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలుండగా 2015లో ఆప్ 67 స్ధానాల్లో విజయబావుటా ఎగురవేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే వరుసగా రెండోసారి గెలిచి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు సీఎం కేజ్రీవాల్.

- Advertisement -