భారత బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాము..

24
- Advertisement -

ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తాలిబన్ దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌ స్వాగతించింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ అత్యంత గడ్డు పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో భారత ప్రభుత్వం అపన్న హస్తం కింద ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి 2023-24 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా భారత్‌ ఆఫ్ఘనిస్థాన్‌కు రూ.200కోట్ల (25 మిలియ‌న్ డాల‌ర్లు) నిధిని కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

భారత్ బడ్జెట్‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు తాలిబ‌న్ సంప్ర‌దింపుల క‌మిటీ మాజీ స‌భ్యుడు సుహైల్ షాహిన్ తెలిపారు. `ఆఫ్ఘ‌నిస్థాన్ అభివృద్ధికి భార‌త్ అంద‌జేస్తున్న మ‌ద్ద‌తును అభినందిస్తున్నాం. దీంతో రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు, న‌మ్మ‌కం, విశ్వాసాన్ని బ‌లోపేతం చేస్తాయి` అని సుహైల్ షాహిన్ చెప్పిన‌ట్లు తెలిపారు. గతంలో భారత్‌ శ్రీలంక ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఆర్థిక సహాయం, నిత్యావసరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

దేశాభివృద్ధి కోసం బడ్జెట్‌ తేలేదు

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు..

- Advertisement -