Bigg Boss 7 Telugu:ఈ వారం అమ్మాయే ఎలిమినేట్

29
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 42 రోజులు పూర్తి చేసుకుంది. 6వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు నయని. గత 5 వారాల్లో ఇంటి నుండి అమ్మాయిలే ఎలిమినేట్ కాగా ఈ వారం కూడా అలానే జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి వచ్చి వారం రోజులే అయినా నయని వెళ్లిపేటప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏడ్చారు. సండే ఫన్ డేలో భాగంగా తొలుత ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. తర్వాత అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల బిగ్ బాస్‌లో సందడి చేశారు.

తర్వాత నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరిగా అశ్విని, నయని మిగిలిపోగా వీరిలో నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు బిగ్ బాస్. దీంతో నయని కంటతడి ఆపుకోలేక పోయింది. నేను వెళ్లిపోతున్నందుకు బాధగా లేదు.. కానీ నేను ఏం ఆడలేదని నన్ను పంపించేస్తున్నారు అన్నదే బాధ అని ఎమోషనల్ అయింది. ఇక స్టేజ్ మీదకు వచ్చిన నయనిపై ప్రశంసలు గుప్పించారు నాగ్.

తొలుత శోభ గురించి మాట్లాడుతూ… హౌస్‌లోకి వెళ్లేటప్పుడు శోభాతోనే ఫస్ట్ గొడవ అవుతుందేమో అనుకున్నా.. కానీ వెళ్లిన తర్వాతే తెలిసింది.. తను చాలా కైండ్, ఎమోషనల్ అని చెప్పుకొచ్చింది. ప్రియాంక గురించి మాట్లాడుతూ చాలా స్వీట్ గర్ల్ సార్ అని తెలపగా అమర్‌దీప్ అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు.. నా ఫస్ట్ మూవీ హీరో అమర్.. నేనే వాడి ఫస్ట్ హీరోయిన్ అని తెలిపింది. తేజ గురించి చెప్పేటప్పుడు ఇంకా ఎమోషనల్ అయింది నయని. తేజ నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తాడు సార్.. నేను తిన్నానో లేదో అని బాగా పట్టించుకుంటాడు అని చెప్పింది. పూజా అయితే నా సొంత అక్కలానే అనిపిస్తుందని.. సందీప్ మాస్టర్ గురించి చెబుతూ టాప్-5లో మీతో కలిసి డ్యాన్స్ చేద్దామనుకున్నా అంటూ నయని చెప్పింది.

Also Read:డెవిల్‌లో మాళ‌వికా నాయ‌ర్‌..

ఇక శివాజీ గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. శివాజీ మా డాడీ సార్.. ఆయన్ను చూస్తేనే నాకు ఏడుపొచ్చేస్తుంది.. హౌస్‌లోకి మొదటగా వచ్చినప్పుడు ఆయన్ను హగ్ చేసుకోవాలి అనుకున్నా.. కానీ నాకు అంత చనువు ఉందో లేదో తెలీదు.. కానీ రెండు రోజులు గడిచిన తర్వాత నాకు కూతురు లేదు నన్నే నీ డాడీ అనుకో అన్నారు.. మిస్ యూ డాడీ అని తెలిపింది.

- Advertisement -