ముష్కిల్‌లో రొమాన్స్ ఉంది…

284
online news portal
Ae Dil Hai Mushkil's Censor Certificate
- Advertisement -

బాలీవుడ్ సినిమా ఏ దిల్‌హై ముష్కిల్‌లో రణబీర్‌ కపూర్‌, ఐశ్వర్యబచ్చన్‌ మధ్య ఉన్న హాట్‌ రొమాన్స్‌ సీన్లకు సెన్సార్‌ బోర్డు కట్‌ చేసినట్టు వచ్చిన వార్తలను చిత్ర నిర్మాత, దర్శకుడు కరణ్‌జొహార్‌ తోసిపుచ్చారు. ఇవన్నీ పుకార్లుగా అయన పేర్కొన్నారు. అనుష్కశర్మ, ఐశ్వర్యరాయ్‌తో కలిసి జియో ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ చిత్రంలోని సారాంశాన్ని సెన్సార్‌ బోర్డు అర్థం చేసుకుంది. అందుకే సెన్సార్‌ బోర్డు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదన్నారు. ట్రైలర్ లో చూపిన అన్ని దృశ్యాలూ సినిమాలో ఉంటాయని తెలిపాడు. అయితే ఎలాంటి ముద్దు సన్నివేశాలు లేవని తేల్చేశాడు. కేవలం కళ్ల ద్వారా మాత్రమే భావాలు ప్రకటింపజేశామని… తన పాత్రకు అనుగుణంగానే ఐశ్వర్య నటించిందని కరణ్ జోహార్ కితాబిచ్చాడు.

online news portal

తాను బోల్డ్‌గా నటించాను అనడం కరెక్ట్‌ కాదని ఐశ్వర్యరాయ్‌ అన్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా హుందాగా ఉన్నాయి. రెండు ప్రాతల మధ్య సంబంధం ఆధారంగా మాత్రమే ఈ సన్నివేశాలను చూడాలని ఐశ్వర్య తెలిపారు. ఆ పాత్ర చాలా ప్రభావ వంతంగా ఉంటుందని ఐశ్వర్యరాయ్‌ చెప్పింది. ఏ దిల్‌ హై ముష్కిల్‌ చిత్రం అక్టోబరు 28న విడుదల కాబోతుంది.

ఈ సినిమాను భారత్ లో విడుదల కానివ్వబోమని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మొదట హెచ్చరించినప్పటికీ.. ఆ తరువాత మెత్తబడింది. సైనికుల సంక్షేమ నిధికి కరణ్ జోహార్..రూ.5 కోట్లు విరాళమిచ్చేందుకు అంగీకరించడంతో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మీరు చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఈ సొమ్మును ఆర్మీ వెల్ఫేర్‌కు ఫండ్ విరాళంగా ఇవ్వాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే ఈ సినిమా మేకర్స్ ని కోరారు.

online news portal

అయితే నాలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్రసక్తి లేదని సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక రాష్ట్రాల్లో ఇది విడుదల అయ్యే అవకాశాల్లేవు. కానీ ఈ సమస్యపై తాము సినిమా నిర్మాతలతో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని ఈ సంస్థ అధ్యక్షుడు నితిన్ డాతార్ పేర్కొన్నారు. బహుశా దీపావళి నాటికి ఈ సమస్య పరిష్కారం అయ్యి. అన్ని రాష్ట్రాల్లోనూ చిత్రం విడుదల కావచ్చు.

- Advertisement -