ఆ డైరెక్టర్‌ నాపై చేయ్యివేశాడు…..

145
anushka sharma

ఇండియాలో టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’కు షో కు చాల పాపులారిటీ ఉంది. ఈ షో లో బడా సెలబ్రిటీలు పాల్గొంటారు. వారిని కరణ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్‌ రేటింగ్‌ రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది.

Karan Johar

అయితే ఈ షోలో గాసిప్సుకు మాత్రం కొదవలేదు. వచ్చిన స్టార్‌ గెస్టులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగి వారి దగ్గర నుంచి కూపీలాగి మరీ వారి సీక్రెట్లు ను బయటపెట్టే కరణ్ తాజాగా ఈషోలో తానే బుక్‌అయ్యాడు. ఇటీవలే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ,కత్రినా కైఫ్‌తో కలిసి షో నిర్వహించాడు. ఈషో లో అనుష్క శర్మ కరణ్‌కు ఝలక్కిచ్చింది. కరణ్‌ తాజాగా తెరకెక్కించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ (ఏడీహెచ్‌ఎం) సినిమా షూటింగ్‌ సందర్భంగా తనను కొన్నిసార్లు అభ్యంతరకరంగా తాకాడని తెలిపింది.

anushka sharma Karan Johar

అంతకుముందు కరణ్‌ మాట్లాడుతూ ఏడీహెచ్‌ఎం షూటింగ్‌ సందర్భంగా తనకు అనుష్కపై ప్రేమ పుట్టిందని పేర్కొంటూ.. ‘నేను నీకు పూర్తిగా పడిపోయాను. నీ కోసం ఆ సినిమా చేశాను’ అంటూ పేర్కొన్నాడు. ఎంతో ఓపిగ్గా ఇదంతా విన్న అనుష్క ఒకింత అసహనంగా.. ‘నేను అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. కొన్నిసార్లు అతను నన్ను అభ్యంతరకరంగా తాకాడు’ అని పేర్కొంది.

anushka sharma Karan Johar

దీనికి కత్రిన స్పందిస్తూ ‘నీలో కొంత చురుకుదనం తేవడానికి అలా చేసి ఉంటాడు’ అని పేర్కొనగా.. అనుష్క మాత్రం వెనుకకు తగ్గలేదు. ‘జాక్వలిన్‌ కూడా నీపై ఫిర్యాదు చేసింది. మనీష్‌ మల్హోత్రా పార్టీలో నువ్వు ఆమెను అసభ్యంగా తాకావంట’ అని పేర్కొంది. దీంతో కత్రిన జోక్యం చేసుకొని ఈ ‘లీగల్‌’ తగాదాను ఇక్కడితో ముగించాలని వేడుకొంది. ఇదంతా వీరు సరదా కోసమే చేశారా? లేక నిజంగా ఏదైనా జరిగిందా? అనేది తెలియాలంటే వీరు ముగ్గురు కలిసి సమాధానం చెప్పెవరకు ఆగాల్సిందే. ఈ వార్త బాలీవుడ్‌లో మాత్రం చర్చనీయంశంగా మారింది.