కొత్తజంటకు పెళ్లికానుకగా కండోమ్‌లు !

194
Advice For Couples Soon In Wedding Gift
Advice For Couples Soon In Wedding Gift
- Advertisement -

భారతదేశంలో లైంగిక అవగాహన, లైంగిక విషయాలపట్ల ఆసక్తి కొత్తేం కాదు. శృంగార కళ ఇక్కడ శిల్పాల్లో, శిల్పకళా చాతుర్యంలో కలగలిసివుంటుంది. అయినా ఇంకా లైంగిక, శృంగార పరమైన అంశాలంటే, ఏదో ఇబ్బంది, అదో నిషిద్ధాంశంగా చూస్తుంటాం. అయితే, ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పుడు లైంగిక అవగాహనకు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకు చాలా ప్రాధాన్యాన్నిస్తుంది నేటి యువత.. అప్పుడే పిల్లలు వద్దనుకునే కొత్త దంపతులు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొత్త దంప‌తులకు అవగాహన ఉండదు.. పాశ్చాత్య దేశాల్లోలాగా మ‌న దేశంలో పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అనేది కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఓ వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌బోతున్న‌ది.

upgovtcondoms

జులై 11న వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ డే సంద‌ర్భంగా ఈ ప‌థ‌కం ప్రారంభించ‌నున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొత్త దంప‌తుల ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశం.. ఈ కిట్స్ ఇవ్వ‌డంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న‌దే త‌మ ఉద్దేశం అని యూపీలో మిష‌న్ ప‌రివార్ వికాస్ కార్యక్ర‌మం చూస్తున్న అవ్‌నీష్ స‌క్సేనా అన్నారు. ఈ కిట్స్‌ను ఆశా (అక్రెడిటెడ్ సోష‌ల్ హెల్త్ యాక్టివిస్ట్‌) వ‌ర్క‌ర్లు పంపిణీ చేస్తారు.

ఈ కిట్‌లో నూతన వ‌ధూవ‌రుల‌కు కండోమ్స్‌, గ‌ర్భనిరోధ‌కాల‌ను అందించ‌నుంది. న‌యీ ప‌హ‌ల్ పేరుతో ఈ కిట్ల‌ను దంప‌తుల‌కు అందిస్తారు. కండోమ్స్‌, కాంట్ర‌సెప్టివ్స్‌తోపాటు సుర‌క్షిత శృంగారంపై సందేశం, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాముఖ్య‌త‌, కొన్ని ట‌వ‌ల్స్‌, క‌ర్చీఫ్స్‌, నెయిల్ క‌ట్ట‌ర్‌, దువ్వెన‌లు, అద్దం ఈ కిట్‌లో ఉంటాయి. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న ఏడు రాష్ట్రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ మిష‌న్ ప‌రివార్ వికాస్ ప్రాజెక్ట్‌లో భాగంగా యూపీ గ‌వ‌ర్న్‌మెంట్ ఈ వినూత్న ప్ర‌య‌త్నానికి శ్రీకారం చుట్టింది. యూపీతోపాటు బిహార్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్‌, అస్సాంల‌లో ఈ మిష‌న్ ప‌రివార్ వికాస్ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు.

- Advertisement -