తీర్పును స్వాగతిస్తున్నా:అద్వానీ

136
advani
- Advertisement -

బాబ్రీ మసీదు కేసులో 28 ఏళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న అద్వానీసహా 32 మందిని నిర్దోషులుగా తేల్చింది న్యాయస్ధానం.

ఈ నేపథ్యంలో స్పందించిన అద్వానీ తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌తో పాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు.

బాబ్రీ తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌,ఢిల్లీలో భారీగా పోలీసులను మొహరించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్నారు.

- Advertisement -