కేరళం..మెజార్టీ ఎమ్మెల్యేలపై కేసులు!

3
- Advertisement -

కేరళం రాజకీయాల్లోని ప్రజాప్రతినిధుల నేపథ్యంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. కేరళం శాసనసభలోని మెజారిటీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాటు, గణనీయమైన సంఖ్యలో కోటీశ్వరులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

కేరళం అసెంబ్లీలోని మొత్తం 140 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 84 శాతం (118 మంది) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. వీరిలో 31 శాతం (44 మంది) ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎల్డీఎఫ్ ,యూడీఎఫ్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ముఖ్య నేతలపై కేసులు ఉండటం గమనార్హం.

ఆర్థిక పరంగా చూస్తే, కేరళం ఎమ్మెల్యేలలో అత్యధికులు సంపన్న వర్గానికి చెందినవారేనని నివేదిక చెబుతోంది. సుమారు 69 శాతం (97 మంది) ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. వీరిలో ఒక్కొక్కరికి రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. కేరళం ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ సుమారు రూ. 3.25 కోట్లుగా లెక్క తేలింది.

Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!

కుట్టనాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ కె. థామస్ సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. 0 శాతం మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు కావడం విశేషం. సుమారు 60 శాతం మంది ఎమ్మెల్యేల వయస్సు 51 నుండి 80 ఏళ్ల మధ్యలో ఉంది. కేవలం 10 శాతం మంది మాత్రమే 25 నుండి 40 ఏళ్ల లోపు యువకులు.

అలాగే 69% ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

- Advertisement -