తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఖమ్మం, మంచిర్యాల జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి గళం వినిపించారు. పదవుల భర్తీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని రేణుకా చౌదరి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలవనున్నారు రేణుకా చౌదరి వర్గీయులు . ఆమె వర్గానికి చెందిన ఒక్క నేతకు కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఒక్క పదవి కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం పని చేసిన వారిని కాదని కొత్త వారికి పదవులు ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వినోద్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పలువురు కాసిపేట మండల సీనియర్ నాయకులు.
Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!
పార్టీ కోసం అందరు పని చేసినప్పుడు ఒక వర్గానికే అన్ని పదవులు ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

