‘2 స్టేట్స్‌’ రీమేక్‌తో శివాని అరంగేట్రం..

200
Adivi Sesh, Shivani to be shot from February
- Advertisement -

హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్‌ నటించిన `2 స్టేట్స్‌` సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అడ‌వి శేష్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

శివాని తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటన కు ఎంతో ఆస్కారం ఉన్న ఈ కథను ఎంచుకోవడం విశేషం. బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్క‌నుంది. దర్శకుడు వెంకట్ రెడ్డి వి.వి. వినాయక్ తో అసోసియేట్ గా చాలా చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత : ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం : వెంక‌ట్ రెడ్డి.

Adivi Sesh, Shivani to be shot from February

- Advertisement -