గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల పాటలను అందించిన ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ మూవీస్ ఆడియోలను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్ లో రిలీజ్ చేయనుంది.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ గుప్త మాట్లాడుతూ….పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 21 చిత్రాల్లో బద్రి, ఖుషి, జల్సా,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది…తదితర 15 చిత్రాల ఆడియోలను మా సంస్ధ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఆడియోను మా ఆదిత్య సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 9 చిత్రాల్లో చిరుత, మగధీర, ఆరెంజ్, ఎవడు తదితర 7 చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ధృవ. ఈ ధృవ చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే విడుదల చేస్తున్నాని తెలిపారు.
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే…. ఆర్య, పరుగు, జులాయి, ఇద్దరమ్మాయిలతో.., సన్నాఫ్ సత్యమూర్తి ఇలా 15 చిత్రాల్లో 12 చిత్రాల ఆడియోలను మేమే రిలీజ్ చేసాం.ఇప్పుడు డిజె దువ్వాడ జగన్నాథమ్ ఆడియోను కూడా మేమే రిలీజ్ చేస్తున్నాం. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద, లోఫర్, కంచె చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే విడుదల చేసాం. వరుణ్ తేజ్ తాజా చిత్రం ఫిదా ఆడియోను కూడా మేమే రిలీజ్ చేస్తున్నాం.
కాటమరాయుడు, ధృవ, డిజె దువ్వాడ జగన్నాథమ్, ఫిదా చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. గోపీచంద్ ఆక్సిజన్, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న నాని నేను లోకల్, శర్వానంద్ శతమానంభవతి, హెబ్బాపటేల్ నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇదే సంస్థ రాజ్ తరుణ్ తో నిర్మిస్తున్న మరో సినిమా ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం అని తెలియచేశారు.