ఆదిత్య 369..రీ రిలీజ్ డేట్!

2
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం ఆదిత్య 369. లెజండరీ డైరెక్ట‌ర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కింది. 1991లో విడుద‌లైన ఈ చిత్రం ఇప్పటికి ఎప్పటికి ఎవర్‌ గ్రీన్ చిత్రమే.

శ్రీదేవీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మూడు ద‌శాబ్దాల త‌రువాత మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌స్తున్నారు. తొలుత ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేకర్స్ తెలిపారు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని మ‌రో వారం రోజుల ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ తెలిపారు. ఏప్రిల్ 4నే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ చిత్రంలో మోహిని, హీరో తరుణ్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read:రుణమాఫీ..బీఆర్ఎస్ నిరసన

- Advertisement -