ఒక్కటైన సిద్దార్థ్‌ -అదితి..వనపర్తిలో జరిగిన పెళ్లి

12
- Advertisement -

టాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్ – అదితీరావ్ ఒక్కటయ్యారు. మార్చిలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరుగగా తాజాగా వీరిద్దరు కలిసి ఏడడుగులు వేశారు. ఇవాళ వీరిద్దరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని సిద్దార్థ్ స్వయంగా వెల్లడించారు. నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా నక్షత్రాలన్నీ.. శాశ్వతమైన పిక్సీ సోల్‌మేట్స్ గా ఉండటానికి, నవ్వులకు, నిత్యనూతనమైన ప్రేమ, లైట్, మ్యాజిక్ మిసెస్ అండ్ మిస్టర్ ఆదు సిద్దూ అని చెబుతూ ఫోటోలను షోర్ చేశాడు సిద్దార్థ్.

తెలంగాణలోని వనపర్తి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అదితి తల్లి ఒకప్పటి వనపర్తి జాగీర్ చివరి రాజా రామేశ్వర రావు కూతురే కావడం విశేషం. దీంతో వనపర్తిలోనే అదితి ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకుంది.

ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో మహా సముద్రం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ మూవీ సెట్స్ లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

Also Read:లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

- Advertisement -