మణిరత్నంతో మరో ఛాన్స్ కొట్టేసింది…

222
Aditi Rao to collaborate with Mani Ratnam again
- Advertisement -

మణిరత్నం.. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక బ్రాండ్‌. ఈ లెజండ‌రీ డైరెక్ట‌ర్‌ నుంచి వ‌చ్చే సినిమాల ఫ‌లితాలు ఎలా ఉన్నా…టేకింగ్‌కి ఎవ‌రైనా ఫిదా అయిపోతారు. అలాంటి ఈ డైరెక్టర్ సినిమాలో న‌టించే ఛాన్స్ వస్తే.. ఎవరైనా ఎగిరిగంతేస్తారు. మరి ఆ ఛాన్స్ వరుసగా రెండు సార్లు వస్తే.. అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదేమో. ఇప్పుడు ఇలాంటి అరుదైన అవ‌కాశం.. బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైద‌రీని వరించింది.

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెలియా’తో ఈ హైదరాబాదీ అమ్మాయి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్న అదితీని మణిరత్నం చూపిన తీరుకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అదితి అందానికి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ అందాన్ని దక్షిణాది తెరపైకి తీసుకొస్తున్నారు మణిరత్నం.

Aditi Rao  to collaborate with Mani Ratnam again

శింబు, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ హీరోలుగా ఆయన దర్శకత్వం రూపొందుతోన్న మల్టీస్టారర్‌లో నటించనున్నట్లు అదితి స్పష్టం చేశారు. శింబుకి జోడీగా, అతని ప్రేయసిగా ఆమె నటిస్తున్నట్టు సమాచారం. ఇది కాకుండా తెలుగులో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంతో సుధీర్‌ బాబు హీరోగా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రంలో అదితి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

- Advertisement -