జనసంద్రమైన…మేడారం

92

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ది పొందిన మేడారం మహాజాతర నాలుగో రోజుకు చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు ఆదివాసీ పూజారులు వనదేవతలు కొలువైన గద్దెల దగ్గరకు చేరుకుంటారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. తండోపతండాలుగా భక్తులు తరలిరావడంతో మేడారం భక్తజనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవార్లున్న చోటు నుంచి ఎటు చూసినా జనమే. జంపన్నవాగులో స్నానాలు చేసి.. తర్వాత తల్లుల దర్శనం కోసం బారులు తీరారు. క్యూ లైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. మేడారం వచ్చే భక్తులకు జంపన్నవాగు, అక్కడ్నుంచి గద్దెల వరకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ఆర్టీసీ. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది.

increasing rush at Medaram

ఓవైపు గద్దెలమీద కొలువుదీరిన సమ్మక్క, సారక్క దర్శనానికి వచ్చే భక్తులకు తోడు.. చివరిరోజున వనప్రవేశం చూసేందుకు ఇంకా ఎక్కువగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది దేవాదాయ శాఖ. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.