అదితి నోట… తెలుగు పాట.. వైరల్

206
Aditi rao

తెలుగు చిత్రపరిశ్రమలో డబ్బింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు చేరువయింది, అందాల తార అదితిరావు హైదరి. తాజాగా సుధీర్ బాబు సరసన సమ్మోహనం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో అదితి నటనతో పాటు, అందంతో అందరిని ఆకట్టుకుంది. సమ్మోహనం మంచి విజయం సాధించడంతో అమ్మడు ఫుల్ ఖుషిగా ఉంది. ఈ సినిమా సక్సెస్ ని అమ్మడు మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంటోంది.

Sammohanam-Aditi-Sudhir

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా.. సమ్మోహనం సినిమాలోని ఓ చెలి తార సాంగ్ ని పాడి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ అమ్మడు పాడిన పాటకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఎంత చక్కగ పాడిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే మీ వాయిస్ బాగుంది, సింగర్ గా ట్రై చెయ్యండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ వీడియోని షేర్స్, లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సమ్మోహనం హిట్ తో సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకోసం అదితిని ఎంపిక చేశారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.