కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యఠాక్రే మండిపడ్డారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీపై ఇవ్వడంపై విమర్శలు కురిపించారు. గౌహతి పారిపోయిన వారికి సెక్యూరిటీ ఇచ్చారు…. ఆ సెక్యూరిటీని కశ్మీరీ పండిట్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ గుర్తు, పార్టీపై ప్రేమను రెబల్స్ కొల్లగొట్టలేరని ఆదిత్యఠాక్రే తేల్చి చెప్పారు. దమ్ముంటే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
మహారాష్ట్ర సంక్షోభానికి కారణమైన ఏక్ నాథ్ షిండే పై విమర్శలు గుప్పించారు ఠాక్రే. షిండేకు గతంలోనే సీఎం పదవి ఇస్తామన్నామని…. మే 30న షిండేకి సీఎం ఆఫర్ చేసినట్లు తెలిపారు. షిండేకి సీఎం పదవి ఇవ్వడానికి ఉద్ధవ్ ఒప్పుకున్నారని…అప్పుడేమో కాదు.. వద్దూ అంటూ నాటకాలు ఆడారు.. సమస్యలున్నాయంటూ ఏడ్చారు అని ఆరోపించారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమని… తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు.