Adipurush:శ్రీరామనవమి స్పెషల్

49
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చింది ఆదిపురుష్ మూవీ టీం. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కృతిసనన్‌ సీతగా నటిస్తోండగా పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది. ఇక సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా వస్తుండగా ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది.

సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫొటో ప్రతి రూపంగా ఈ పోస్టర్ ని నిర్మించారు. మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్‌ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ కనిపిస్తుంది.

జూన్ 16న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -