Adipurush:విమర్శలు – వివాదాలు.. వివరణ

37
- Advertisement -

ఆదిపురుష్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ప్రభాస్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ మూవీని నార్త్ ఇండియా ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేదనిపిస్తోంది. ప్రభాస్ రాముడిలా అనిపించడం లేదని, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ పాత్ర చేస్తే బాగుండేదేమో అని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. తమ హీరోను అవమానిస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఆదిపురుష్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందూ దేవుళ్ల చిత్రాలను అభ్యంతరకరమైన డైలాగులు, కాస్టుమ్స్‌తో చిత్రీకరించి హిందువులను మనోభావాలను ఉద్దేశపూర్వకంగానే కించపరిచారని అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి శిశిర్ చతుర్వేది ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ‘ఆదిపురుష్’ చిత్ర నిర్మాతలు, నటీనటులపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.

Also Read:కాజల్ కి బాలయ్య టీమ్ గిఫ్ట్

ఐతే, ఈ వివాదాలు, విమర్శల పై ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాయణం చాలా పెద్దదని, దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. ఇది పూర్తిగా అర్థమైందని చెప్పేవారు మూర్ఖులు లేదా అబద్ధాలు చెబుతున్నారని ఓం రౌత్ అన్నారు. ఇక తన ‘ఆదిపురుష్’ రామాయణంలోని యుద్ధ కాండపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు.

Also Read:Kushi:ఓటీటీ డేట్ ఫిక్స్

- Advertisement -