ప్చ్.. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

45
- Advertisement -

ఆదిపురుష్ సినిమాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదిపురుష్‌ సినిమాపై “తక్షణమే నిషేధం” విధించాలని అయోధ్యలోని సాధువులు డిమాండ్ చేశారు. ఈ సినిమాలోని డైలాగ్‌ లు అసలు బాగాలేవని సాధువులు చెబుతున్నారు. హిందూ మతాన్ని వక్రీకరించేలా ఈ సినిమాను చిత్రీకరణ జరిగిందని మండిపడుతున్నారు. అలాగే ‘మహాభారత్’ సీరియల్‌లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా ఈ సినిమా మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పౌరాణిక గ్రంథాలను అవమానపరిచే హక్కు ఎవరిచ్చారన్నారు. రామాయణాన్ని అపహాస్యం చేశారని, రావణుడికి ఏం వరాలు ఉన్నాయో కూడా వీరికి తెలియదా? అన్నారు. ఈ సినిమా మేకర్స్ ను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిలబెట్టి తగలబెట్టాలని చెప్పారు. కాబట్టి మనం కూడా ‘ఆదిపురుష్’ మేకర్స్‌ను తగలబెట్టాలి అని ముఖేశ్ ఖన్నా ఘాటుగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ముఖేశ్ ఖన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read:మెగా ప్రిన్సెస్‌ కు తాతల సెంటిమెంట్

మొత్తానికి ఈ విమర్శలన్నీ ‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్స్ పై కూడా పడుతున్నాయి. మొదటి మూడు రోజులు మంచి వసూలు రాబట్టిన ఆదిపురుష్ నాలుగో రోజు మాత్రం దారుణంగా పడిపోయింది. ఆల్ మోస్ట్ 80 శాతానికి వసూల్లు పడిపోయాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 242 కోట్లు కాగా, ఇంకా 78.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిఉంది. నేడు కూడా కలెక్షన్స్ అసలేం బాగాలేదు అని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఆదిపురుష్ ఎంత వరకు కవర్ చేస్తుందో చూడాలి.

Also Read:Yoga Day:అంతర్జాతీయ యోగా దినోత్సవం..

- Advertisement -