బాలీవుడ్ ఫేం ప్రభాస్ తానాజీ ఫేం దర్శకుడు ఓంరౌత్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ కృతిసనన్ జంటగా నటిస్తున్న… ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో జూన్16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా జైశ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ విడుదలైంది.
Also Read: Hollywood:మరోసారి సిద్ధమైన గాడ్జిలా వర్సెస్ కాంగ్..!
నీ సాయం సదా మేమున్నాం అంటూ విడుదలైన పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అజయ్ -అతుల్ సంగీతం అందించారు. కాగా ఇందులో సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నారు. ఆదిపురుష్‌ను దాదాపు 10భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500కోట్లతో నిర్మిస్తున్నారు.
Also Read: వినాయక్ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. !